కరోనా మహమ్మారి మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు ప్రజలు. అందుకే కరోనా తగ్గిపోయింది కదా అనే భ్రమలో ఉండకుండా మాస్క్, శానిటైజర్, సామజిక దూరం పాటించడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. మరోమారు ప్రముఖ సినీ సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్ కు కరోనా సోకగా… తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరోకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మంచు హీరో కరోనా సోకినట్టు స్వయంగా వెల్లడించారు.
మంచు మనోజ్ తాజాగా సోషల్ మీడియాలో తనకు కోవిడ్ సోకినట్టు వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ లో “కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత వారంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. నా గురించి చింతించకండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను పూర్తిగా బాగున్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
A post shared by Manoj Kumar Manchu (@manojkmanchu)