నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల విడుదలైన తన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రను పోషించింది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న కొత్త ఇంటికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో సామాన్లను ప్యాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రష్మిక మళ్లీ కొత్త ఇల్లు కొనుక్కుందా ? అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 2021లో రష్మిక మందన్న ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం రష్మిక మిషన్ మజ్ను, గుడ్‌బై అనే రెండు హిందీ చిత్రాలలో నటిస్తోంది. అయితే బాలీవుడ్ సినిమాల షూటింగ్ కోసం హోటల్స్‌లో బస చేయకుండా ముంబైలో కొత్త ఇంటిని కొన్న రష్మిక ఇప్పుడు మళ్లీ ఇల్లు మారుతున్నట్లు కనిపిస్తోంది.
Read Also : SSMB28 : మహేష్, త్రివిక్రమ్ మూవీ గ్రాండ్ లాంచ్
కాగా తాజాగా రష్మిక హైదరాబాద్‌లో కనిపించింది. ఇక రష్మిక మందన్న చివరిసారిగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప : ది రైజ్”లో కన్పించి అలరించింది. ఆమె ఇప్పుడు “పుష్ప : ది రూల్” షూటింగ్ కోసం సిద్ధమవుతోంది. ఇది మార్చిలో ప్రారంభమవుతుంది. సీక్వెల్ 2022 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.
