ఇప్పటికే టాలీవుడ్ లో ఫిబ్రవరి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా “సన్ ఆఫ్ ఇండియా” కూడా ఫిబ్రవరిలో రావడానికి సిద్ధమయ్యాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇక చాలా రోజుల తరువాత తెరపైకి రాబోతున్న మోహన్ బాబు సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కాంట్రవర్సీ క్వీన్