మెగా ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ట్రీట్ ఉండబోతోంది ఇకపై… తమ అభిమాన హీరోలను వెండి తెరపై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా వివిధ కారణాలతో మెగా హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే మరికొద్ది నెలల్లో మెగా అభిమానులకు నాన్‌స్టాప్ ట్రీట్ వచ్చేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మెగా హీరోలు నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Read Also : స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే లే’ అంటాడా ?… ‘పుష్ప’రాజ్ పై గరికపాటి ఫైర్
ఇటీవల టాలీవుడ్ బిగ్ మూవీస్ అన్నీ వరుసగా విడుదల తేదీలను ప్రకటించాయి. వాటిని బట్టి చూస్తే మరో రెండు నెలల్లో కనీసం ఒక్క మెగా హీరో అయినా థియేటర్లలోకి రాబోతున్నాడు. ముందుగా వరుణ్ తేజ్ ఈ సంబరాలను ప్రారంభించబోతున్నాడు. ఆయన స్పోర్ట్స్-డ్రామా ‘గని’ ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న తెరపైకి రావచ్చు. త్వరలోనే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇంతలో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రానుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ కూడా ఏప్రిల్ 29న విడుదల తేదీని ఖరారు చేసింది. వరుణ్ తేజ్ మరో చిత్రం ‘ఎఫ్3’ ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇది షెడ్యూల్ ప్రకారం వస్తుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. అనుకున్న సమయానికి వస్తే ఆ వీకెండ్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుంది. ఏది ఏమైనా ఇప్పటి నుండి వచ్చే మూడు నెలల పాటు ప్రతి నెలా తమ అభిమాన హీరోలను వెండితెరపై చూస్తూ మెగా అభిమానులు ఆనందించవచ్చు.