యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే అందరి దృష్టి ఉంది ఇప్పుడు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఎన్టీఆర్30’ హ్యాష్ ట్యాగ్ ను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ రూపొందనుంది. అయితే ఇప్పుడు అభిమానుల డిమాండ్ ఏమిటంటే… సినిమా నుంచి అప్డేట్ కావాలట. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ ను వెండి తెరపై చూడాలన్న ఫ్యాన్స్ కాంక్షకు కోవిడ్ అడ్డుకట్ట వేసేసింది. దీంతో ఇప్పుడు ‘ఎన్టీఆర్30’ నుంచి అప్డేట్స్ కోరుతున్నారు యంగ్ టైగర్ అభిమానులు.
Read Also : “సలార్”పై క్రేజీ బజ్… త్వరలో అనౌన్స్మెంట్
ఎట్టకేలకు నందమూరి ఫ్యాన్స్ కోసం నిర్మాతలు ప్రాజెక్ట్‌పై త్వరలోనే వరుస అధికారిక అప్డేట్స్ ఇవ్వనున్నారు. ‘ఎన్టీఆర్ 30’కి సంబంధించిన ఫస్ట్ అప్ డేట్ ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కానుంది. ఇందులో ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ఎంపికైన అలియా భట్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. ఇంకా సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్, మిగిలిన నటీనటులు, సిబ్బందికి సంబంధించిన అప్‌డేట్‌లు తదనుగుణంగా వెలువడతాయి. ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ ఈ ఫిబ్రవరిలో లేదా మార్చి మొదట్లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ కానుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ‘ఎన్టీఆర్ 30’తో పాటు, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, బుచ్చి బాబుల ప్రాజెక్ట్స్ ఉన్నాయి.