సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు, గురు ఫిలింస్ అధినేత్రి సునీత తాటి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇది తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకుడు. మంగళవారంతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ లో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు. సెట్‌ను సిద్ధం చేయడంతో పాటు, కస్టమ్-మేడ్ కారును కూడా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో చివర్లో శ్రీ సింహ కోడూరి ఎంట్రీ ఇచ్చారు. 72 మంది టీంతో 342 గంటల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారని మేకర్స్ వెల్లడించారు. అలాగే సింగిల్ లొకేషన్ లో షూట్ చేశారు.
చేసిన దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఆ దొంగ జీవితం ఊహించిన మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందనే అంశాన్ని ఇందులో దర్శకుడు సతీశ్ త్రిపుర చూపించాడట. ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముతిర కని ఓ కీలక పాత్రను పోషించాడు. కాల భైరవ సంగీతం అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=TmCzbisjjrE