LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం.. ఇలా చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder Booking: గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు సులభంగా ఇంటి నుంచే ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వాట్సాప్, మొబైల్ యాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రధాన గ్యాస్ సరఫరా సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఇండేన్), హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ గ్యాస్) మరియు భారత్ పెట్రోలియం (భారత్ గ్యాస్) వినియోగదారులకు కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మరియు మొబైల్ యాప్‌ల ద్వారా సిలిండర్ బుకింగ్ సౌకర్యాలను అందిస్తున్నాయి.
ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో LPG బుకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం వస్తోంది. దాంతో యాప్ లేదా కాల్ సేవల్లో కొన్నిసార్లు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో ఇతర పద్ధతుల ద్వారా కూడా సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు.
Also Read
- Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
- Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
- Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
- Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
ఫోన్ కాల్ ద్వారా LPG సిలిండర్ బుకింగ్
* HP Gas వినియోగదారులు: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 88888 23456 అనే IVRS నంబర్‌కు కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే 94936 02222 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా బుకింగ్ చేయవచ్చు.
* Bharat Gas వినియోగదారులు: 77150 12345 లేదా 77180 12345 నంబర్లకు కాల్ చేసి LPG రీఫిల్ బుక్ చేసుకోవచ్చు.
* Indane Gas వినియోగదారులు: 7718955555 నంబర్‌కు కాల్ చేయడం లేదా SMS పంపడం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
* WhatsApp ద్వారా LPG బుకింగ్: ఇప్పుడు గ్యాస్ సిలిండర్లను వాట్సాప్ ద్వారా కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ గ్యాస్ కంపెనీ వాట్సాప్ నంబర్‌ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి.
WhatsApp బుకింగ్ నంబర్లు:
* Indane Gas: 75888 88824
* HP Gas: 92222 01122
* Bharat Gas: 1800 22 4344
ఈ నంబర్లకు వాట్సాప్‌లో “Hi” లేదా “Refill” అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
మొబైల్ యాప్ ద్వారా బుకింగ్
ప్రతి గ్యాస్ కంపెనీకి ప్రత్యేక మొబైల్ యాప్‌లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా సిలిండర్ బుకింగ్, చెల్లింపు మరియు డెలివరీ స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు.
– Indane: IndianOil ONE
– HP Gas: HP Gas App
– Bharat Gas: Hello BPCL
ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి లాగిన్ అయిన తర్వాత బుకింగ్ చేసుకోవచ్చు.
LPG బుకింగ్ నిబంధనల్లో మార్పు
ఇటీవల ప్రభుత్వం LPG సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పుడు ఒక సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజులు వేచి ఉండాలి. గతంలో ఈ వ్యవధి 21 రోజులు మాత్రమే ఉండేది. సిలిండర్ల నిల్వను నివారించడం మరియు వినియోగదారులందరికీ సమానంగా గ్యాస్ సరఫరా అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి కొన్ని చోట్ల 45 రోజులకు కూడా పెంచినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!