ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘కిరోసిన్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మించారు. దర్శకుడు ధృవ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, ‘కేరాఫ్ కంచరపాలెం’ రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘కిరోసిన్’ మూవీని జూన్ 17న విడుదల చేయబోతున్నారు. ఎన్నో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ తో కూడిన సినిమా ఇదని, ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ కు చక్కని స్పందన వచ్చిందని, ఈ మూవీ ద్వారా ఓ కొత్త అంశాన్ని చూపించబోతున్నారనే భావన ప్రేక్షకులకు కలిగిందని ధృవ తెలిపారు.