టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారా.. అంటే ఔననే వినిపిస్తోంది ఇండస్ట్రీ వర్గాల్లో. ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ అందించిన మహేష్.. ఈ సారి మాత్రం అథితి పాత్రలో మెరవబోతున్నాడట. అది కూడా ఓ కోలీవుడ్ స్టార్ హీరోలో సినిమాలో అని తెలుస్తోంది. అయితే మహేష్ ఫ్యాన్స్ అందుకు ఒప్పుకుంటారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్.. మహేష్ గెస్ట్ రోల్ నిజమేనా..! సర్కారు వారి పాటతో…
హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా భారీగా రెమ్యూనరేషన్‌గా పెంచేసి.. క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. అలాంటి ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఎన్నో కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు పవన్ సినిమా వదులుకోవడానికి ఇదే అసలు కారణమని తెలుస్తోంది. మరి పూజా పవన్‌ని నిజంగానే రిజెక్ట్ చేసిందా..! ప్రస్తుతం టాలీవుడ్ స్టార్…
చిత్రసీమలో కొన్ని బంధాలు, అనుబంధాలు చూస్తే ఏనాటివో అనిపించక మానదు. హీరో కృష్ణ, నటదర్శకనిర్మాత ఎమ్.బాలయ్య బంధం అలాంటిదే! ఇక కృష్ణ, జయప్రద జోడీ కూడా ప్రత్యేకమైనదే- ఎందుకంటే కృష్ణ సరసన విజయనిర్మల తరువాత అత్యధిక చిత్రాలలో నాయికగా నటించిన క్రెడిట్ జయప్రదకే దక్కింది. ఇలా అనుబంధం ఉన్న వీరి కలయికలో ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ అనే చిత్రం తెరకెక్కింది. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.బాలయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు. 1977…
సూపర్ స్టార్ రజనీకాంత్ కథతో సినిమా రాబోతోందా అంటే.. ఖచ్చితంగా ఔననే అంటున్నాయి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. అయితే రజనీ కథతో అంటే.. బయోపిక్ అనుకుంటే పొరపాటే.. తలైవా అప్ కమింగ్ ఫిల్మ్ కోసం.. స్వయంగా తనే కథను అందిస్తున్నారట రజనీ. అలాగే ఆ సినిమాలో దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఐశ్వర్య రాయ్‌తో జోడి కట్టబోతున్నారట.. ఇంతకీ ఏంటా సినిమా..! గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్…
జూన్ 4న యస్.పి. బాలు జయంతి పురస్కరించుకుని సినీ మ్యుజీషియన్స్ యూనియన్ రవీంద్రభార తిలో ‘బాలుకి ప్రేమతో’ పేరుతో పాటల కచేరి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యం.ఎల్.ఏ రసమయి బాలకిషన్, పాటల రచయిత చంద్రబోస్‌తో హాజరయ్యారు. వీరితో పాటు సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షలు ఆర్.పి పట్నాయక్, అధక్షురాలు, నేపధ్యగాయిని విజయలక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు, జనరల్ సెక్రటరీ రామాచారి, ట్రెజరర్ రమణ సీలం, జాయింట్ సెక్రటరీ ఆర్. మాధవి, ఈసి మెంబర్…
హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తనను ట్రోల్ చేసినవారికి ఘాటుగా సమాధానాలు చెప్తూ వారి నోరు మూయిస్తుంది. ఇక కొన్నిసార్లు అమ్మడు హద్దు దాటి ప్రవర్తించిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు బిడ్డలా తల్లి అయినా చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకొని, హాట్ హాట్…
సినిమా పరిశ్రమలో ఫ్యాన్స్ ఉండాలన్న…పబ్లిక్‌లోకి వెళితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, పాపులారిటీ, సెలబ్రిటీ హోదా వంటివి కేవలం హీరోలు, నటులకు మాత్రమే దక్కుతాయి. ఎంత ఖర్చు పెట్టి సినిమాను తీసిన నిర్మాతకైనా, ఎన్నో రోజులు కష్టపడి సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ పేరు, గుర్తింపు హీరోకే దక్కుతాయి. అందుకేనేమో…డైరెక్టర్‌గా చేసిన చాలా మంది హీరోలుగా, నటులుగా మారిపోయారు. అయితే అందులో అందరూ సక్సెస్ కాకపోయినప్పటికి కొందరు మాత్రం ఆడియన్స్ దగ్గర పాస్ మార్కులు వేయించుకున్నారు.…
అక్కినేని అందగాడు అఖిల్ కు కెరీర్ లో ఒక్క సరైన హిట్ లేక కిందా మీద పడుతున్నాడు. మొదటి సినిమాతోనే మాస్ హీరో అనిపించుకోవాలని ట్రై చేసినా అది కాస్త బెడిసికొట్టింది. తరువాత లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేసినా అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఒక్క హిట్ ఐనా అందుకోవాలని అఖిల్ కసిమీద కనిపిస్తున్నాడు. అందుకే వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు అఖిల్ అక్కినేని ఏం చేస్తున్నారు? సురేందర్ రెడ్డి…
పేరుకు తగ్గట్టే గుణశేఖర్ ఓ ప్రత్యేకమైన గుణమున్న దర్శకుడు. సక్సెస్ కోసం పరుగులు తీయరు. అలాగని కమర్షియల్ ఫార్ములానూ వీడరు. చిత్రసీమలో దాదాపు మూడు దశాబ్దాల నుంచీ దర్శకునిగా ఉన్నా, గుణశేఖర్ తీసింది పట్టుమని పన్నెండు సినిమాలే! అయినా వాటిలో అన్నిటా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నమే చేశారు గుణశేఖర్. గుణశేఖర్ 1964 జూన్ 2న అనకాపల్లి సమీపంలోని నర్సీపట్నంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో చెన్నపట్నం చేరారు. డి.వి.నరసరాజు, క్రాంతికుమార్, రామ్ గోపాల్ వర్మ వంటి వారి వద్ద…
నటశేఖర కృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ తెరకెక్కించిన అనేక చిత్రాలు మాస్ ను విశేషంగా అలరించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘హంతకులు – దేవాంతకులు’. ఎస్.ఆర్.కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 1972 జూన్ 2న విడుదలై జనాన్ని ఆకట్టుకుంది. ‘హంతకులు – దేవాంతకులు’ కథ ఏమిటంటే – రాజేశ్ సి.ఐ.డి. – అచ్చు అతనిలాగే ఉండే అతని అన్నను, అతని తల్లిని బలరామ్, లైలా, ప్రేమ్ అనే దుండగులు చంపేసి, డబ్బు దోచుకుంటారు.…