సాయి ధన్సిక, కిశోర్, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర, పోసాని ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘షికారు’. అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా హరి కొలగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైజాగ్ కు చెందిన ప్రముఖ పంపిణీదారుడు పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 24న విడుదల కావాల్సి ఉన్న ‘షికారు’ చిత్రాన్ని ఇప్పుడు జూలై 1వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు చిత్ర నిర్మాత.
ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ”ఊహించని విధంగా చిక్కుల్లో పడిన తమ స్నేహితుడిని మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఎలా బయటకు తీసుకొచ్చారు? దాని పర్యవసాలు ఏమిటీ? అనేదే ఈ సినిమా. ఇందులో సాయి ధన్సిక పోషించిన పాత్ర యువతను బాగా ఆకట్టుకుంటుంది. చమ్మక్ చంద్రపై చిత్రీకరించిన సాంగ్ మూవీకి హైలైట్ అవుతుంది. అలానే సిద్ శ్రీరామ్ పాడిన పాటకూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శేఖర్ చంద్ర చక్కని బాణీలతో పాటు మంచి నేపథ్య సంగీతం అందించారు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఫన్ రైడ్ లా సాగుతుంది” అని అన్నారు