ప్రతి వ్యక్తి జీవితంలో తొలి హీరో తండ్రి అనే చెప్పాలి. మన వెనుక నీడగా వుండి, అండగా నిలబడి తన బిడ్డ గొప్పగా ఎదగాలని, తన కొడుకు గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని ఆపడతాడు ఆతండ్రి. తన కొడుకు మరొకరు పొగుడుతుంటే నాన్న ఆనందం ఆశాన్నంటుతుంది. తన కొడుకు ఉన్నతికి పాటు పాడే నాన్న గొప్పతనాన్ని ఓ రోజులో చెప్పుకుంటే సరిపోతుందా! అంటే సరి కాదనే సమాధానమే వినిపిస్తుంది. కుటుంబం కోసం తండ్రి చేసే త్యాగాలను గుర్తు చేసుకుని ఆయనకు థాంక్స్ చెప్పడమే ఈరోజు ప్రత్యేకత. ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే ను ఇండియా, అమెరికా వంటి దేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో మాత్రం ఏప్రిల్, మే నెలల్లో సెలబ్రేట్ చేసుకుంటారు.
అయితే.. ఫాదర్స్ డే సందర్భంగా మన తారలు కూడా వారి తండ్రితో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా నెమరు వేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేశారు. కొణిదెల వెంకట్రావు కానిస్టేబుల్. ఆయన కూడా నటుడే. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన నటనకు దూరమయ్యారు. కానీ తన కొడుకు చిరంజీవిని మాత్రం నటన వైపు అడుగులేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు మరి. చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన చిరంజీవి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కృషి, పట్టుదలతో క్రమ క్రమంగా ఎదుగుతూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. 150కి పైగా చిత్రాల్లో నటించారు. తన కుటుంబానికి సినీ ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చి పెట్టారు. ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలున్నా కూడా ఇప్పటికీ ఆయన సినిమాల్లో నటిస్తున్నారు.
It is a great feeling to be a grateful son and a proud father! #HappyFathersDay to all!💐😍 pic.twitter.com/3n7OFwQ8Ka
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2022