నేడే టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి.. టెన్త్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అయితే, టెన్త్ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ రోజు పదవ తరగతి ఫలితాల విడుదల చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో టెన్త్ ఫలితాలను ప్రకటించనున్నారు.. కాగా,…
ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.
హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం 'ఉగ్రం'. మీర్నా మీనన్ హీరోయిన్గా ఈ చిత్రంలో నటించింది. తాజాగా ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్..! వైసీపీలో చేరనున్న సీనియర్ నేత.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. అయితే, ఇప్పుడు టీడీపీకి షాక్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అందులో భాగంగా త్వరలోనే ఆత్మకూరు…
హీరోయిన్ మెహ్రీన్ కూడా చేరింది. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో మరీ సన్నబడింది.
మేడారం జాతరకు తేదీలు ఖరారు.. వివరాలు తెలిపిన పూజారులు ఆదివాసీలది విశిష్టమైన జీవన విధానం.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ ప్రకృతితో ఐక్యంగా ఉండే ఈ గిరిజనుల ప్రధాన దేవతలు. ఈ మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. తాజాగా.. మేడారం జాతర- 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు…
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన.. విశేషాలు ఇవే.. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ తర్వాత రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు…
సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ దృష్టి సారించిన ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (SSMPP)కి పర్యావరణ క్లియరెన్స్ (EC) ఇతర అవసరమైన అనుమతులను అధికారుల నుండి త్వరలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం (CWC), కేంద్ర పర్యావరణ & అటవీ మంత్రిత్వ శాఖకు పంపిన ప్రాజెక్ట్ తాజా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) అన్ని సంభావ్యతలలో, పర్యావరణ…