హార్ట్ ఎటాక్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ అదా శర్మ.మొదటి సినిమా తోనే ఫెయిల్యూర్ ను రుచి చూసినా కూడా అదృష్టం కొద్ది సినిమా ఇండస్ట్రీలోనే ఆమె కొనసాగుతూ ఉంది.గత కొన్ని సంవత్సరాలుగా అదా శర్మ కొన్ని చిన్న సినిమా ల్లో నటిస్తోంది. కొన్ని ఐటం సాంగ్స్ లో కూడా అలరించింది. కానీ ఇప్పటి వరకు ఈమె ఎన్ని సినిమాలు చేసిన కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు..
అంతే కాకుండా ఈ మధ్య ఈమెకు సినిమా ల్లో అవకాశాలు రావడమే కష్టం అయ్యింది. అలాంటి సమయంలో అనూహ్యంగా ది కేరళ స్టోరీ అనే సినిమా లో నటించే అవకాశం ఆమెకి దక్కించుకుంది. ఒక హిందూ అమ్మాయి ని మతం మార్పించి ఎలా ఉగ్రవాదంలోకి దించారు అనేది ఆ సినిమా కథ. ఈ పాత్ర కు నటన కూడా అత్యంత కీలకం. అదా శర్మ ఆ సినిమాలో అద్భుతంగా నటించింది.అన్ని విధాలుగా కూడా అదా శర్మ వావ్ అనిపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు గతంలో స్కిన్ షో చేసిన సినిమాలు ఆమెకు అంత గుర్తింపు ఇవ్వలేదు.. కానీ ఈ మధ్య కాలంలో ఈమె చేసిన కేరళ స్టోరీ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.సుమారు 250 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకున్న నేపథ్యం లో అదా శర్మ క్రేజ్ కూడా బాగా పెరిగింది. కానీ తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఇంకా కూడా ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆమె మళ్లీ ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇక ముందు అయినా ఆమె వరుసగా సినిమా ల్లో నటిస్తుందో లేదో చూడాలి.స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ రాకపోయిన కనీసం చిన్న హీరోల సినిమా లు అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమా లకు అయినా అదా శర్మ ను ఫిల్మ్ మేకర్స్ ను ఆమెకు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.