Home
Tollywood News
Tollywood News News
-
Pushpa 3: ఇక ఇప్పట్లో పుష్ప 3 లేనట్టే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ (ది రూల్) 2024 డిసెంబర్ 5న విడుదలై బెంచ్‌మార్క్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, పుష్ప 3 (ది ర్యాంపేజ్) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ‘పుష్ప 2’ రిలీజై ఏడాది పూర్తయినా, మేకర్స్ నుండి ‘పుష్ప 3′ గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవడం చర్చనీయాంశమైంది.’పుష్ప 2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా… -
Samantha : సమంత హనీమూన్‌ను కూడా వదలట్లేదు కదరా!
నటి సమంత, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా, తన ప్రొఫెషనల్ విషయంలో చాలా క్లారిటీతో వ్యవహరిస్తుంటారు. తాజాగా, ఆమె తీసుకున్న నిర్ణయం గురించి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె హనీమూన్‌కు వెళ్లకుండా నేరుగా షూటింగ్లో పాల్గొనడంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లయిన నాలుగో రోజుకే సమంత తిరిగి షూటింగ్లో పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారింది. “పెళ్లి పెళ్లే.. యాక్టింగ్ యాక్టింగే” అంటూ ఆమె హనీమూన్ ట్రిప్‌ను… -
Champion: ఛాంపియన్’తో నందమూరి హీరో రీ ఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత, 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. స్వప్న సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఛాంపియన్’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారు. నందమూరి త్రివిక్రమరావు (ఎన్టీఆర్ సోదరుడు) కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి, బాలకృష్ణతో పాటు దాదాపు అదే జనరేషన్లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదట ‘తలంబ్రాలు’, ‘ఇంటి దొంగ’, ‘దొంగ కాపురం’, ‘మేనమామ’, ‘అక్షింతలు’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ఆయన… -
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేపై ఐరెన్ లెగ్ ముద్ర చెరిగేదెప్పుడు?
గ్లామర్‌తో ఆకట్టుకునే నటీమణులలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. కానీ, ఆమె కెరీర్ ప్రారంభం నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. “భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌గా వుంటుందేగానీ… పెర్ఫార్మెన్స్ నిల్” అంటూ విమర్శకులు తేల్చేశారు. అయితే, ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి భాగ్యశ్రీ ప్రయత్నించింది. స్కిన్‌షోతోపాటు… యాక్టింగ్ కూడా చూపించినా, బాక్సాఫీస్ మాత్రం ఈ అమ్మడిని కరుణించలేదు. దీంతో సినీ వర్గాల్లో ఆమెపై ‘భాగ్యశ్రీ వుంటే ఫ్లాపే’ అన్న ముద్ర (ఐరన్ లెగ్) పడిపోయింది. Also Read :Prabhas : డార్లింగ్‌కు… -
Naari Naari Naduma Murari: పెద్ద సినిమాల నడుమ మురారి
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘సామజవరగమన’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగకు సరైన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘నారి నారి నడుమ మురారి’ 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో… -
Akhanda 2: ‘అఖండ–2’ ప్రీమియర్ షోలు రద్దు… బాలయ్య ఫ్యాన్స్ రచ్చ
Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ–2’ పై అభిమానుల్లో నెలకొన్న భారీ హైప్‌కు మధ్య, ప్రీమియర్ షోలు రద్దు కావడంతో రాజమండ్రి కాకినాడలలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టికెట్లు తీసుకుని థియేటర్లకు వెళ్లిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. రాజమండ్రిలోని అశోక థియేటర్ వద్దకు బాలయ్య అభిమానులు ముందుగానే చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో ప్రీమియర్ షో రద్దయిందన్న సమాచారం రావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత పట్ల అసహనం… -
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా డబుల్ ధమాకా.. రాజమౌళి ‘వారణాసి’తో పాటు.. ఆ భారీ సీక్వెల్లో కూడా..?
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు! ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లో రెండు మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో భాగం కాబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గుప్పుమంది. అందులో మొదటిది.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్… -
Varanasi: బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో ‘వారణాసి’ టైటిల్ ఇదేనా!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి గురించి చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జక్కన్న స్థాయి ప్యాన్ ఇండియా సరిహద్దులు దాటి అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్లిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకున్నాయి. ఇదే సమయంలో మహేష్ బాబు అభిమానులు ఖుషీ అయ్యే న్యూ్స్ వైరల్ అయ్యింది. జక్కన్న కొత్త సినిమా మహేష్ బాబుతోనే అని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో… -
Varanasi : SS రాజమౌళి వారణాసిలో మహేశ్ బాబు మేనళ్లుడు
దర్శక దిగ్గజం రాజామౌళి దర్సకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న భారీ చిత్రం వారణాసి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ‘రుద్ర’ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతోంది. Also Read : Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే కాగా ఈ… -
Sampath Nandi: టాలీవుడ్ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం..
టాలీవుడ్లో విభిన్న సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సంపత్ నంది. తాజాగా, ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నంది కిష్టయ్య, అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తెలుగులో సంపత్ నందికి దర్శకుడిగా మంచి పేరుంది. ఆయన చివరిగా దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల 2 (ఓదెల సెకండ్ పార్ట్) రిలీజ్ చేశారు. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక,…
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?