Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. కానీ, బాబుకు మాత్రం వయస్సు పెరిగేకొద్దీ అందం పెరుగుతుంది. ప్రస్తుతం మహేష్ ఏజ్ 48.అయితే .. మహేష్ ను చూసిన వారెవ్వరు కూడా అది ఒప్పుకోరు. చివరికి ఫారిన్ కంట్రీలో కూడా మహేష్ ఏజ్ 48 అంటే ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక యూట్యూబర్.. మహేష్ ఫోటో చూపించి ఫారిన్ కంట్రీ అమ్మాయిలను అడగ్గా.. అందరూ అతనికి 25, 27 అని చెప్పుకొచ్చారు. అది మహేష్ అందం అంటే. అలా మెయింటైన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఇక నిత్యం నమ్రత.. మహేష్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా మహేష్ మరో కొత్త ఫోటోను షేర్ చేశాడు. లేజర్ ఫోకస్ అని దానికి క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చాడు. ఇక ఈ లుక్ లో మహేష్ అదిరిపోయాడు. వైట్ టీ షర్ట్ పై డెనిమ్ బ్లూ జాకెట్.. తీక్షణంగా చూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చుసిన అభిమానులు అతడు సినిమాలోని డైలాగ్ ను గుర్తుతెచ్చుకుంటున్నారు. ప్రకాష్ రాజ్.. రాహుల్ దేవ్ ను నందు ఎలా ఉంటాడు అని అడుగుతూ బొమ్మ గీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కళ్ళు.. కళ్ళు ఎలా ఉంటాయి అనగానే.. రాహుల్ దేవ్.. వేటకు వెళ్లేటప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో.. అలా ఉంటాయి అని చెప్తాడు కదా.. ఇప్పుడు ఈ ఫోటో చూస్తే అదే డైలాగ్ గుర్తొస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.