Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక నేడు మహిళా దినోత్సవ సందర్భంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో పవర్ ఫుల్ మహిళ కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఆమె ఎవరో కాదు అంజలి. ఈ చిత్రంలో అంజలి.. రత్నమాల గా కనిపించనుంది. విశ్వక్ అక్కగా ఆమె నటిస్తుందని టాక్. హీరోయిన్ గా నటిస్తూనే.. అంజలి కీలక పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. ఈ కథ నచ్చడంతో ఆమె ఈ పాత్రకు ఒప్పుకుందని టాక్. ఇక రెడ్ కలర్ చీర కట్టుకొని.. స్టూల్ మీద కాలు పెట్టి.. చేతిలో కత్తి.. చుట్టూ ఉన్నఆడవాళ్లు కూడా చేతుల్లో కత్తులు, కొడవళ్లు పట్టుకొని కోపంతో ఊగిపోతున్నట్లు కనిపించారు. అయితే ఆ కోపానికి కారణం ఏంటి.. ? రత్నమాల ఇంత వైలెంట్ గా ఎందుకు ఉంది అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. గత కొన్నిరోజులుగా ఈ సినిమా వాయిదాల మీద నడుస్తూ వసిస్తుంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.