Gopichand: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని గోపీచంద్ అభిమానులు పాటలు అందుకుంటున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాట వారికి బిగా సెట్ అవుతుంది ఈ టైమ్ లో. గత కొంతకాలంగా గోపీచంద్.. బాక్సాఫీస్ మీద యుద్ధమే చేస్తున్నాడు కానీ, గెలవలేకపోతున్నాడు. సినిమాలు, మంచి కథలు ఎంచుకుంటున్నాడు కానీ, అభిమానులను మెప్పించలేకపోతున్నాడు. గతేడాది రామబాణం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలకృష్ణ పెట్టిన టైటిల్, సున్నా కలిసివస్తుంది అనుకున్నారు.. అది జరగలేదు. ఇక ఈసారి ఎలాగైనా గోపీచంద్.. అభిమానులను అలరించాలని ఫిక్స్ అయ్యి.. భీమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె. కె. రాధామోహన్ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటించారు. ట్రైలర్, సాంగ్స్ మంచి హైప్ అందించాయి.
ఇక నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది. గోపీచంద్ వన్ మ్యాన్ షో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు గోపీచంద్ మాస్ కటౌట్ కు ఇలాంటి సినిమా ఎప్పుడో పడాల్సిందని అభిమానులు అంటున్నారు. క్రూరమైన పోలీస్ ఆఫీసర్ భీమాగా మ్యాచో స్టార్ గోపీచంద్ నటన నెక్స్ట్ లెవెల్ అని, ప్రభాస్ కు సలార్.. గోపీచంద్ కు భీమా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక కలక్షన్స్ గురించి రేపు తెలుస్తుంది. మౌత్ టాక్ బావుంది అంటే.. స్లో గా వెళ్లినా కూడా రికార్డ్ కలక్షన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ పీక్స్ అని, గోపీచంద్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అని చెప్పుకొస్తున్నారు. అయితే.. కొద్దిగా స్లో నేరేషన్ ఉందని, హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ కొంచెం ఎబెట్టుగా ఉందని అంటున్నారు. ఏదిఏమైనా భీమాతో గోపీచంద్ హిట్ కొట్టాడు అనేది సోషల్ మీడియా టాక్. మరి ముందు ముందు ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.