Kalki 2898AD: హమ్మయ్య.. ఎట్టకేలకు కల్కిలో ప్రభాస్ పేరు తెలిసిపోయింది. భైరవగా ప్రభాస్ కనిపించబోతున్నాడు.. అంతేనా స్టైలిష్ లుక్ లో డార్లింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే.. ఆ పోస్టర్ చూసిన కొంతమంది మాత్రం ఒకటి తక్కువైంది.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు మొత్తం ఆందోళన చెందుతున్నారు. అసలు ఇంతకు ఏం తక్కువైందిరా.. అని అంటే.. రిలీజ్ డేట్ ఎక్కడరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. అమితాబచ్చన్, దిశా పటాని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ మొదటి నుంచి కన్ఫ్యూజింగ్ గానే ఉంది.
ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు.. అప్పుడు, ఇప్పుడు అని చెప్పుకుంటూనే వచ్చారు కానీ, రిలీజ్ డేట్ చెప్పలేదు. ఇక అభిమానులు అడగ్గా అడగ్గా.. మే 9 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఏదో ఒకటిలే.. ప్రభాస్ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రాబ్లెమ్ లేదు అనుకున్నారు. కానీ, తీరా చూస్తే.. మే నెలకు ఇంకా ఒక నెల మాత్రమే గడువు ఉంది. ఈలోపు షూటింగ్ పూర్తిచేయాలి, విఎఫ్ఎక్స్, ప్రమోషన్స్.. ఇలా చాలా ఉన్నాయి. ఇటు చూస్తేనేమో.. షూటింగే ఇంకా అవ్వలేదు. ఇదే గందరగోళంగా ఉందిరా మావా అంటే.. నేడు రిలీజ్ చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ ను ఎత్తేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంటే.. ఈసారి కూడా వాయిదా.. ? ఏమైనా చేస్తారా అని అనుమానించడం మొదలుపెట్టారు. పోస్టర్ లో డేట్ వేయకుడు కానీ, మేకర్స్ క్యాప్షన్ లో మే 9 న కల్కి అని రాయడంతో కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.