Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణుకి జంటగా ప్రీతీ ముఖుంధన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నప్ప సినిమాపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మునుపెన్నడూ లేని విధంగా అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం.. ఆల్ ఇండస్ట్రీలలోని స్టార్స్ ను మొత్తం విష్ణు.. ఈ సినిమాలో చూపిస్తున్నాడు. ఇక నేడు మహా శివరాత్రి పర్వదినం కావడంతో.. కన్నప్ప చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. శివుని పరమ భక్తుడు కన్నప్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కన్నప్పగా మంచు విష్ణు కనిపించాడు. పారుతున్న జలపాతం నుంచి సగం బయటికి వచ్చి విల్లు ఎక్కి పెట్టి.. దేనికో గురి పెట్టినట్లు విష్ణు కనిపిస్తున్నాడు. ఇక విష్ణు గెటప్ నెక్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ పాత్ర కోసం విష్ణు పడిన కష్టం.. పోస్టర్ లో కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కన్నప్ప కథను సంపూర్ణంగా చెప్పేస్తోంది. ఈ పోస్టర్ పాత్రలోని ధైర్యం, కారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీని చూపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసేలా ఉంది. బాక్సాఫీస్‌పై విష్ణు మంచు ఆ విల్లు ఎక్కుపెట్టినట్టుగా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో విష్ణు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Honoured and privileged to portray the greatest devotee of Lord Shiva, 'Kannappa'. Today on MahaShivaRatriॐ, here is your '#𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹'.@themohanbabu @Mohanlal #Prabhas @realsarathkumar @PDdancing @mukeshvachan #preitymukhundhan #Brahmanandam @GkParuchuri @prasaadnaidu5… pic.twitter.com/v8dF7ufvaI
— Vishnu Manchu (@iVishnuManchu) March 8, 2024