24న ‘లవ్ స్టోరీ’ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ రోజున నాని నటించిన ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదల కావటంతో తమ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు ‘లవ్ స్టోరీ’ దర్శకనిర్మాతలు. అయితే ఈ సారి ఆరు నూరైనా సెప్టెంబర్ 24న రావటం ఖాయం అంటున్నారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ సినిమాస్ నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు పలు మ్యూజిక్ ఛార్ట్ లలో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.

Also Read
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!