నిన్న కొడుకుతో… నేడు తండ్రితో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవితో సంపత్ నంది సినిమా!?
‘సీటీమార్’ వంటి కమర్షియల్ హిట్ తో ఊపుమీద ఉన్నాడు డైరెక్టర్ సంపత్ నంది. గోపీచంద్ వంటి ప్లాప్ స్టార్ కి హిట్ ఇవ్వటమే కాక టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపు తెచ్చాడు. ఈ హిట్ తో ఏకంగా మెగా స్టార్ ని దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడట సంపత్ నంది. మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్నది సంపత్ నంది కల. గతంలో వీరి కలయికలో సినిమా వస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. రామ్ చరణ్ తో ‘రచ్చ’ చేసినప్పటి నుంచి చిరంజీవి సంపత్ తో సినిమా చేయాలనుకున్నారట. అయితే ఎందుకో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. అయితే ‘సీటీమార్’ విజయం తర్వాత ఆ అవకాశాలు మెరుగయ్యాయనే చెప్పవచ్చు. చిరంజీవి ఇమేజ్ ని బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని సంపత్ ఓ లైన్ వినిపించాడట. చిరు కూడా ఆసక్తిని వ్యక్తం చేసి పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని కోరినట్లు వినికిడి.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి చేసిన మోహన్ రాజాతో చిరు ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేశ్ తో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో సినిమా కమిట్ అయి ఉన్నారు. సరైన రీతితో స్క్రిప్ట్ సిద్ధం చేస్తే సంపత్ కు చిరుతో అవకాశం ఖాయం. గతంలో రామ్ చరణ్ కి ‘రచ్చ’ లాంటి మాస్ ఇంటర్ టైనర్ ఇచ్చిన సంపత్ చిరుతో ఎలాంటి సినిమా చేస్తాడో చూద్దాం…. ఆల్ ద బెస్ట్ సంపత్.

తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!