కరోనా క్రైసిస్ లో సినీపరిశ్రమ కార్మికులు సహా ఆపదలో ఉన్న ఎందరినో చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరు అందించిన ఆపత్కాల సాయం చిత్రసీమలో చర్చనీయాంశం అయ్యింది. దాసరి నారాయణరావు కో-డైరెక్టర్ ప్రభాకర్ కి చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి అమ్మాయి చదువుకు అవసరమైన ఫీజును వారు అందించారు. ఈ విషయాన్ని గురించి స్వయంగా ప్రభాకర్ తెలియచేశారు. ”నేను దాసరి గారి వద్ద ఎన్నో సంవత్సరాలు కో-డైరెక్టర్ గా పని చేశాను. చిరంజీవి నటించిన…
నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు చిరు తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల…
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి ప్రిక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. చైతు పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ షురూ చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్నారు. గ్రామీణ…
దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసిని. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సుహసిని అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారామె. గతంలో ఎన్టీయార్ – కృష్ణవంశీ ‘రాఖీ’ చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. ‘ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ పాత్రను ‘బలమెవ్వడు’ చిత్రంలో పోషిస్తున్నార’ని ఆ చిత్ర దర్శకుడు సత్య రాచకొండ…
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి! కామెడీ చిత్రాల హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారినా, రాజేంద్రుడి వినోదపు జల్లుకు ఫుల్ స్టాప్ పడలేదు. దానికి తాజా ఉదాహరణ ఆ మధ్య వచ్చిన ‘గాలి సంపత్’ చిత్రం. అందులోనూ ఒక కంట పన్నీరు మరో కంట కన్నీరు ఒలికించారు రాజేంద్ర ప్రసాద్. జూలై 19 నటకిరీటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు…
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం…
‘6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి, శంకర్‌దాదా ఎంబీబీఎస్, నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కళాకార్’. వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్…
(జూలై 17న రంగనాథ్ జయంతి) సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా? అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది. ప్రతిభావంతులకు ఏదో ఒకరోజున తారాపథం తివాచీ పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ విషయంలో నిజమయ్యాయని ఒప్పుకోక తప్పదు. రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు. అదే ఆయనను కవిగా మార్చిందని…
టాలీవుడ్ అందాల బ్యూటీ నిధి అగర్వాల్ కావాల్సినంత గ్లామర్ ను ఆరబోస్తున్న.. కొందరు ఆకతాయిలు మాత్రం ఆమెకు ఫేక్ ఫోటోలు షేర్ చేస్తూ కోపం తెప్పిస్తున్నారు. తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టీవ్ గా వుండే నిధి సడెన్ గా సీరియస్ అయింది. ఈమేరకు ఓ పోస్ట్ చేసింది. ‘నాకు సంబంధించిన ఓ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం…