‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ (శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ” ‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. మా ఫ్యామిలీ…
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా, కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ జంటగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే పేరుతో కొత్త సినిమా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్ధేశీ పై అల్లు అన్విత క్లాప్ నివ్వగా,…
పాత కథలకే కొత్త సొబగులు అద్ది సరికొత్తగా మలచి అలరించారు ఎందరో దర్శకులు. ఈ తరం దర్శకులు కూడా అదే తీరున సాగుతున్నారు. అలాంటి విన్యాసాలు ఏ నాడో చేసి ఆకట్టుకున్నారు దర్శకరచయిత, నటుడు భాగ్యరాజా. ఈ తరం వారికి దర్శకునిగా ఆయన పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. నవతరం ప్రేక్షకులలో కొంతమందికి ఆయన నటునిగా పరిచయం ఉన్నారు. చాలా రోజుల నుంచే భాగ్యరాజా నటనలో రాణిస్తున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా కనిపిస్తున్నారు. అయితే నటునిగా,…
ఆ రోజుల్లో అందాలనటిగా రాజ్యమేలిన బి.సరోజాదేవి తెరపై కనిపిస్తే చాలు అభిమానుల మది ఆనందంతో చిందులు వేసేది. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడసీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఆచార్య, గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో మెగా 154 కూడా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తున్నదంట. ‘క్రాక్’ హిట్ తో ట్రాక్ ఎక్కిన ఈ బ్యూటీ…
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రౌడీ బాయ్స్ విడుదలకు సిద్దమవుతుండగా.. 18 పేజిస్ షూటింగ్ జరుపుకొంటుంది. ఇక అమ్మడు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో విరుచుకుపడుతుంది. తాజగా అనుపమ చీరకట్టులో దర్శనమిచ్చింది. ముగ్ద స్టూడియోస్ పట్టు చీర.. పెద్ద కొప్పు దాని చుట్టూ రోజాపూలతో చూడగానే అలనాటి అందాల తారలు గుర్తొచ్చేలా కనిపించింది. ఇక అను నవ్వుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. పట్టు…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఎంతటి ప్రజాదరణ పొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ల కబుర్లు, బాలయ్య పంచులతో ప్రతి శుక్రవారం సందడి సందడిగా సాగుతోంది. ఇక ఇప్పటికే 10 ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగియనున్నదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరి గెస్ట్ గా మహేష్ బాబు రానుండగా.. 9 వ ఎపిసోడ్ కి ‘లైగర్’ సందడి చేయనున్నాడు. విజయ్ దేవరకొండ…
చిత్ర పరిశ్రమలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నా ప్రియమైన అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను కరోనా బారిన పడ్డాను. స్వల్ప లక్షణాలతో కరోనా…
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా పరాజయమెరుగుని దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన ఈ సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి 2022 సమ్మర్ లో రావచ్చని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాల కెరీర్ ని ఫణంగా పెట్టి నటించారు తారక్, చెర్రీ. ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ కి…
అనుకున్నంతా అయ్యింది! తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అందరిలోనూ ఇది వాయిదా పడే ఛాన్స్ ఉందనే అనుమానం కలిగింది. ఓ పక్క కరోనా కేసులు పెరగడంతో పాటు తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ పెట్టడం, ఆదివారం లాక్ డౌన్ ప్రకటించడంతో సహజంగానే స్టార్ హీరో…