పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలో కొద్దిగా సమయం దొరికింది అంటే ఆయన తన నలుగురు పిల్లలతో సమయం గడుపుతూ ఉంటారు. ఇప్పటివరకు పవన్ నలుగురు పిల్లలు ఒకే చోట ఉండడం చూడలేదు. పవన్ మొదటి భార్య ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య, రెండో భార్య అన్న లెజినావో ఇద్దరు పిల్లలు.. మొత్తం నలుగురు పిల్లలతో పవన్ సందడి చేసిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అకీరా, ఆద్య తల్లి రేణు దగ్గర పెరుగుతున్నా తండ్రి ప్రేమకు ఆమె ఎప్పుడు దూరం చేయలేదు. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా ఈ చిన్నారులిద్దరు సందడి చేస్తూనే ఉంటారు. ఇక పవన్ ప్రస్తుతం లెజినావో తో కలిసి ఉంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు విడిగా కనిపించడమే తప్ప నలుగురు పవన్ తో కలిసి కనిపించడం అనేది అరుదు. ఇక తాజాగా అలంటి అరుదైన ఫోటో ఒకటి అభిమానులు కనిపెట్టేశారు.
నలుగురు పిల్లలు, రెండో భార్య లెజినావో తో పవర్ స్టార్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫోటో దీపావళీ వేడుకలలో తీసినట్లు కనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిలు ఒకే తరహా డ్రస్ ధరించడంతో పాటు పవన్ కళ్యాణ్ మరియు అకీరాలు కూడా ఒక తరహా డ్రస్ లో కనిపించి చూడముచ్చటగా ఉన్నారు. ఇక ఈ ఫొటోలో రేణు దేశాయ్ కూడా బావుండేదని, ఆమె ఒక్కరే మిస్ అయ్యారని పవన్ అభిమానులు తెలుపుతున్నారు. పవన్, రేణు తో విడిపోయాక కూడా పవన్ అభిమానులు ఆమెను వదినా అనే పిలుస్తుంటారు. ఆమె కూడా ఏనాడు పవన్ పై నెగిటివ్ గా మాట్లాడింది లేదు. దీంతో రేణు అంటే అందరికి అభిమానమే. దీంతో రేణు కూడా పవన్ పక్కన ఉంటే బావుండేది అని అభిప్రాయపడుతున్నారు. ఇక నలుగురు పిల్లలతో జనసేనాని సందడి చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.