మాస్ మహారాజ రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ సంక్రాంతి పర్వదినాన ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. జనవరి 14న ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ఈ పూజకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడితే.. సింపుల్ గా కనిపించినా.. తారక్ లుక్ లో నిత్యం రాజసం కనిపిస్తూనే ఉంటుంది. ఇక అదే తారక్ రాయల్ లుక్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండడం సాధ్యం కానీ పని. తాజాగా తారక్ రాయల్ లుక్ లో మెరిసి ఆహా అనిపించాడు. రాయల్ బ్లూ బంద్‌గాలా సూట్ లో అదరగొట్టేశాడు.…
తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయాలతో విశేషంగా అలరించిన ఘనత నందమూరి తారక రామారావు సొంతం. ఆయన తరువాత ఇతరులు ఎన్ని సినిమాల్లో డ్యుయల్ రోల్స్ లో కనిపించినా, ఆ స్థాయిలో ఆకట్టుకున్న దాఖలాలు కనిపించవు. యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లోనూ ద్విపాత్రలతో మురిపించారు. రామారావు ద్విపాత్రాభినయంతో రూపొందిన జానపద చిత్రాల్లో ‘గోపాలుడు-భూపాలుడు’ 55 ఏళ్ళ క్రితం సంక్రాంతి సంబరాల్లో భలేగా అలరించింది. 1967 జనవరి 13న విడుదలైన ‘గోపాలుడు-భూపాలుడు’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి జి.విశ్వనాథం…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ వేర్ పేరుతో విజయ్ ఒక బ్రాండ్ దుస్తులను అమ్ముతున్న విషయం విదితమే. ఈ రౌడీ బ్రాండ్ కి అభిమానుల్లోనే కాదు స్టార్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ దుస్తులకు పడిపోయిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఇకపోతే ఎప్పటికప్పుడు వైరైటీ వైరైటీ కలెక్షన్స్ తో ముంచుకు వచ్చే మన రౌడీ హీరో ఈసారి కొత్త…
మెగా మేనల్లుళ్లు, పంజా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మధ్య ఉన్న సోదర ప్రేమ గురించి వర్ణించడం కష్టమే. తమ్ముడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో అన్న సాయి ధరమ్ తేజ్ ప్రయత్నం చాలా గట్టిది. ప్రతి కథలో తాను ఇన్వాల్వ్ అవ్వకుండా వైష్ణవ్ తేజ్ సింగిల్ గా నిర్ణయం తీసుకొనేలా నేర్పించాడు. అతడి సక్సెస్ ని సాయి తేజ్ సెలబ్రేట్ చేశాడు. ఇక వైష్ణవ్ కూడా ఏమి…
ప్రముఖ మలయాళ హీరో దిలీప్ నటించిన ‘కేశు ఈ వీడిండే నాథన్’ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నటుడిగా కాస్తంత గ్యాప్ తీసుకుని దిలీప్ చేసిన సినిమా ఇది. ఈ కథ ఇలా ఉంటే… తాజాగా గురువారం కేరళకు చెందిన మూడు పోలీస్ బృందాలు దిలీప్, అతని సోదరుడు ఇంటిపై దాడులు నిర్వహించాయి. 2017లో దిలీప్ ప్రముఖ కథానాయికను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసు ఒకటి పోలీసుల విచారణలో ఉంది. దీనిని విచారిస్తున్న క్రైమ్…
మహేశ్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసింది. 2006లో ఆల్ టైమ్ హిట్ గా నిలచిన ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేశ్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’ మంచి వసూళ్ళు రాబట్టింది. ‘బిజినెస్…
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం జగన్ ఇస్తారని నమ్మకంగా చెప్పిన చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు. ” సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా జగన్ గారు నిర్ణయం తీసుకొంటామన్నారు.. అప్పటివరకు సినిమా రంగంలోని వారు సమన్వయం పాటించాలి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ వాళ్ళకు నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ పెద్దగా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ భేటీ ముగిసింది. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గంటన్నర పాటు మెగాస్టార్ చిరంజీవి కి, సీఎం జగన్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినాట్లు తెలుస్తోంది. ఇక భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ” జగన్ గారితో తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగింది. సంక్రాంతి పండగ పూట ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం…