కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ ఐ ఆర్’. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ విష్ణు విశాల్ బ్యానర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఐఎస్…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ముగింపు దశకు చేరుకొంది. గత కొన్ని వారాలుగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తాజా సీజన్ త్వరలో ఎండ్ కాబోతోంది. ఇక ఈ చివరి ఎపిసోడ్ ని సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ…
వెండితెరపై బ్యాట్ మేన్ కథలు కళకళలాడం కొత్తేమీ కాదు. 1943లో లూయిస్ విల్సన్ బ్యాట్ మేన్ గా నటించిన సీరియల్ తొలిసారి జనానికి వినోదం పంచింది. తరువాత బ్యాట్ మేన్ గా రాబర్ట్ లోవరీ నటించిన బ్యాట్ మేన్ అండ్ రాబిన్ కూడా 15 ఎపిసోడ్స్ సీరియల్ గానే అలరించింది. ఆ తరువాత 1966లో బ్యాట్ మేన్ సినిమాగా జనం ముందు నిలచింది. ఇందులో ఆడమ్ వెస్ట్ బ్యాట్ మేన్ పాత్రలో మురిపించారు. అదే సంవత్సరం మళ్ళీ…
‘బన్నీ, భగీరథ, ఢీ’ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘నాకౌట్’. దీని ద్వారా మహీధర్ హీరోగా, ఉదయ్ కిరణ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయ్యాయి. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హీరో, హీరోయిన్ల పై తీసిన తొలి సన్ని వేశానికి సాయి రాజేశ్ క్లాప్…
‘బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా’ వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో రమేశ్ గనమజ్జి నిర్మిస్తున్న ‘బ్యాచ్’ మూవీలో సాత్విక్ వర్మ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి భాగం ‘బ్యాచ్ 1’ను ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. నేహా పఠాన్ హీరోయిన్ గా నటించిన ఈ ‘బ్యాచ్’ మూవీకి రఘు కుంచె సంగీతం అందించారు. చిత్ర దర్శకుడు…
పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల.. ముద్దుగా బొద్దుగా ఉండడంతో పాటు వయ్యారాలు ఒలకబోయడంలో ఈ మాత్రం వెనకాడకపోయేసరికి మొదటి సినిమాతోనే అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అయ్యేసరికి అమ్మడి పంట పండింది. ఈ సినిమా విజయం గురించి పక్కన పెడితే శ్రీలీల కు మాత్రం మంచి ఆఫర్లను తీసుకొచ్చిపెట్టింది. పెళ్లి సందD విడుదల కాకముందే ఈ కుర్ర బ్యూటీ మాస్ మహారాజ రవితేజ…
తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి. చక్రవర్తి అసలు…
ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు…
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా…
టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో స్తానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లా నాయక్. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగవంశీ ఎంతగానో ప్రయత్నించారు. ఎవరు ఆపినా ‘భీమ్లా నాయక్’ ఆగదని, తమ సినిమాపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పిన నాగవంశీ.. పవన్ కళ్యాణ్ చెప్పడంతో…