మెగా హీరో వరుణ్ తేజ్, సయీ ముంజ్రేకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనో, మే లోనో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. ఫిబ్రవరి 25 న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 25 న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది.
ఇక ఈ నేపథ్యంలో గని ఆ రిలీజ్ డేట్ ని కబ్జా చేసేశాడు. అంటే అందరు అనుకున్నట్లుగానే భీమ్లా నాయక్ వాయిదా పడినట్లే. అందుకే బాబాయ్ రిలీజ్ డేట్ ని అబ్బాయ్ లాగేసుకున్నాడు. ఇక ఇదే రోజు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ వచ్చేస్తున్నాడు. ఒకటేమో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ కాగా.. మరొకటిస్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం … మరి ఈ రెండు సినిమాలో ఏది హిట్ గా నిలుస్తుందో చూడాలి.