మెగా పవర్ స్టార్ రాంక్ హారం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతుండగా.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో మొదలయ్యింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు చెర్రీ. ఈ రెండింటిని పూర్తిచేయి చరణ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నాడట.
ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను మెప్పిస్తున్న స్నాగతి తెలిసిందే. స్టార్లను ఇంట్లో ఉన్నవారందరికి మరింత చేరువ చేస్తోంది. ఇప్పటికే వెంకటేష్, రానా లతో కలిసి రానా నాయుడు అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిన నెట్ ఫ్లిక్స్ కన్ను ఇప్పుడు రామ్ చరణ్ పై పడిందనే టాక్ వినిపిస్తోంది. చరణ్ తో కలిసి నెట్ ఫ్లిక్స్ మేకర్స్ సూపర్ హిట్ యుఎస్ఎ సిరీస్ ను రీమేక్ చేయబోతున్నారట. త్వరలోనే చెర్రీ ని కలిసి అన్ని విషయాలు మాట్లాడి ఫైనలైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్ సైతం డిజిటల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.