మెగాస్టార్ చిరంజీవి దాదాపు 13 సంవత్సరాల తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నారు. రాజకీయాలనుంచి తప్పుకుని ‘ఖైదీ నెం.150’తో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు అనూహ్యవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న యువహీరోలకు దీటుగా సాగుతున్నట్లు అర్థం అవుతుంది.…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి అయిన శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయం తెల్సిందే. తనకు న్యాయం చేయాలంటూ సుధ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం విదితమే. ఇక ఈ కేసులో శ్యామ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తనకు బెయిల్…
టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి ‘భామాకలాపం’ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 11 న ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇక భామాకలాపం గురించి ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” నేను టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేశాను. సవాల్ విసిరే పాత్రల్లో నటించాను. ఇక తాజాగా ‘భామాకలాపం’ తో…
సినిమా హీరోలు ఎందుకు అంత పారితోషికం తీసుకుంటారు అనేది అందరి డౌట్.. కానీ సినిమాలో ఒక్కో సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి వారుచేసే కష్టం మాటల్లో చెప్పలేనిది. తాజాగా హాలీవుడ్ హీరో టామ్ హాలాండ్ ఒక సీన్ కోసం ఏకంగా 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడట. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం అన్ ఛార్టెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అన్ ఛార్టెడ్ అనే వీడియో…
గాన కోకిల లతా మంగేష్కర్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందనే చెప్పాలి. ఎంతోమంది సంగీత అభిమానులు లతాజీ మృతిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే లతాజీ మృతి తర్వాత అందరిని తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయి. సుమారు రెండు వందల కోట్ల ఆస్తులకు లతాజీ యజమానురాలు. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ ఆస్తులను అనుభవించడానికి ఆమెకు వారసులు లేరు. ఎందుకంటె ఆమె వివాహం చేసుకోలేదు, కనీసం…
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బడే మియా చోటే మియా’. ఇదే టైటిల్ తో బిగ్ బి అమితాబ్, గోవిందాతో 1998లో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషు భగ్నాని ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా దీని బడ్జెట్ ను రూ. 300 కోట్లకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలనాటి ‘బడే మియా చోటే మియా’లో అమితాబ్, గోవింద ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. డేవిడ్…
దేశ వ్యాప్తంగా బుల్లితెర వీక్షకులను అలరించిన ‘మహాభారత్’ సీరియల్ లో భీముడి పాత్రను పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి (75) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్’ సీరియల్ ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘తన తండ్రి సోమవారం రాత్రి 9.30 లకు ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించార’ని ఆయన కుమార్తె నికుణిక తెలిపింది. కేవలం బుల్లితెర నటుడిగానే కాకుండా అమితాబ్ ‘షెహన్ షా’, ధర్మేంద్ర ‘లోహా’తో పాటు ‘ఆజ్ కా…
పసిమి ఛాయ, చారెడేసి కళ్ళు, కొనదేలిన ముక్కు, దొండపండులాంటి పెదాలు, ఇలా వర్ణించుకుంటూ పోతే మౌనుల నిగ్రహానికి సైతం పరీక్ష పెట్టే విగ్రహం వై.విజయ సొంతం. తెరపై వై.విజయను చూడగానే ‘పులుసు’ అంటూ కేకలు వేసేవారు జనం. “మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య” చిత్రాల్లో చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకొనే పాత్రలో కనిపించారు వై.విజయ. అప్పటి నుంచీ ఆ పేరుతోనే ‘పులుసు’ విజయగా జనం మదిలో నిలచి…
సోషల్ మీడియా లో హీరోయిన్ల మీద ట్రోల్ చేసే ఆకతాయిలకు కొదువ లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఇలాంటి ఆకతాయిల వేధిపులకు గురైన వారే. కొంతమంది ఇలాంటి కామెంట్స్ ని లైట్ తీసుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఇలాంటి ఆకతాయిలకు గట్టిగా బుద్ధి చెప్తారు. తాజాగా ఇదే పని చేసింది టాలీవుడ్ హీరోయిన్ నందితా శ్వేత. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమ కథా చిత్రం 2 , అక్షర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత ఎప్పుడు…
అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెల్సిందే. ఈ జంట విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఇప్పటివరకు నిత్యం ఏదో ఒక వార్తలో ఈ జంట నిలుస్తున్నారు. ఇప్పటికి సామ్ ని విడాకుల విషయంలో చాలామంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇవేమి పట్టించుకోని సామ్ మాత్రం తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తుంది. ఒకపక్క సినిమాలు మరోపక్క స్నేహితులతో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇకపోతే…