పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర తన అనుభవాలను సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఇది మలయాళ రీమేక్ అయినా ఈ మూవీని చూసి వారే మళ్ళీ దీనిని రీమేక్ చేసేలా తాము మార్పులు, చేర్పులూ చేశామన్నారు. పవన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాని స్పాన్ పెరిగిందని, అలాంటి సమయంలో త్రివిక్రమ్ గారు ఇచ్చిన సజెషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. రచయితగా, దర్శకుడిగా ఆయన…
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘మారన్’ మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. దానికి సరిగ్గా కొద్ది గంటల ముందే చిత్ర నిర్మాత టి. జి. త్యాగరాజన్… ధనుష్ అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ను అందించారు. ఈ మూవీ టైటిల్ హ్యాష్ ట్యాగ్ కు ట్విట్టర్ లో ధనుష్ లోగోను పెట్టారు. ఈ రకంగా సినిమా పేరుపక్కనే హీరో…
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా కాకముందే మోడలింగ్ చేసిన విషయం తెల్సిందే. 18 ఏళ్ళ వయసులోనే ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను, ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చేవారట. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన సలహా తనను చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ” కెరీర్ బిగినింగ్ ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. నాకు…
కింగ్ నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి నటించడం అనేది మనం సినిమాతో మొదలైంది. ఆతర్వాతచేసిన సినిమాలలో చైతుతోనే నాగ్ కనిపించాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో నాగ్, చైతూల స్క్రీన్ ప్రజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక దీంతో ఫ్యాన్స్ అఖిల్ తో కూడా ఒక మల్టీస్టారర్ చేయమని నాగ్ ని అడుగుతున్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నాగ్, అఖిల్ మల్టీస్టారర్ రానున్నదట. ఇటీవల మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ సినిమాను…
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో తాప్సీ పన్ను నటిస్తున్న చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవలే ఈ సినిమాలోని ‘ఏమిటీ గాలం’ పాటను మేకర్స్ విడుదల చేశారు. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా కంటెంట్ ప్రధానమైన చిత్రాలనూ నిర్మిస్తోంది. ఆ మధ్య వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా చక్కని గుర్తింపుతో పాటు విజయాన్ని పొందిన స్వరూప్ కు ఇది రెండో సినిమా. మార్క్ కె రాబిన్ సంగీత…
జాతీయ ఉత్తమ నటి విద్యాబాలన్ వీలైనంతవరకూ అర్థవంతమైన చిత్రాలలోనే నటిస్తుంటుంది. ఆమె తాజా చిత్రం ‘జల్సా’ కూడా అలాంటిదే. విద్యాబాలన్ తో పాటు షెఫాలీ షా కీలక పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ డ్రామాను సురేష్ త్రివేణి తెరకెక్కించారు. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ తో కలిసి ఈ మూవీని విక్రమ్ మల్హోత్రా, శిఖాశర్మ, సురేష్ త్రివేణి నిర్మించారు. మానవ్ కౌల్, రోహిణీ హట్టంగడి, ఇక్బాల్ ఖాన్, విద్యార్థి బండి, శ్రీకాంత్ మోహన్ యాదవ్, షఫీన్ పటేల్,…
మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్ సామాగ్రిని హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు తెలుపుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణు మేనేజర్ కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను పంపిన ఒక సెల్ఫీ…