ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే స్టార్ హీరోల లైనప్ లు చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది అభిమానులకు.. ఒక్కో హీరో మరో పెద్ద డైరెక్టర్ తో జతకట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్నది ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలను ఒక సినిమా ద్వారా కలిపిన ఘనత రాజమౌళికే చెల్లుతుంది. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న దిట్ట.. ఆయనతో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటాడు.. ఇక ఆయన సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలని ఎంతోమంది నటీనటులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలను పాన్ ఇండియా హీరోలుగా మార్చడం ఆయన వలనే అవుతుంది.
ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, నాని, సునీల్ వంటి హీరోలతో జక్కన్న చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో జక్కన్న ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పనిచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ తో సినిమా పూర్తి అయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కనున్నదట. ఇక ఈ విషయం తెలిసాక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ.. రాజమౌళితో సినిమా విడుదల అయ్యాక ఏ రేంజ్ లో ఉంటాడో చూడాలి.