మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతుండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఈ చిత్రాలలో రెండు సినిమాలు రీమేక్ కాగా.. మెగా 154 మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఉమెన్స్ డే రోజున శృతిని చిత్రంలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉన్నదట. ఆ పాత్ర కూడా కీలకమే కావడంతో స్టార్ హీరోయినే తీసుకోవాలని మేకర్స్ భావించి కోలీవుడ్ భామ నివేతా పేతురాజ్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇక దీంతో చిరు మరో రికార్డ్ ని బద్దలు కొట్టినట్టే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.. ఇప్పటివరకు చిరు.. కొడుకు చరణ్ నటించిన హీరోయిన్లతో నటించి మెప్పించగా.. ఇప్పుడు అల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ సరసన నటించిన నివేతాతో రొమాన్స్ చేయడం అరుదైన రికార్డు అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరు కు ఏజ్ అనేది ఒక నెంబర్ అని తెలిసిందే . ఇప్పటికి ఆయనతో పోటీపడి డాన్స్ చేసే హీరో లేడు అంటే అతిశయోక్తి కాదు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.