ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడ విన్న.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజాగా RRR ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా భాగం అయ్యారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళితో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఫన్నీ చిట్ చాట్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేయగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన సీక్రెట్స్ ని బయటపెట్టారు. తారక్ కు, రాజమౌళి కు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎంత అంటే రాజమౌళి ఫ్యామిలీలో ఎన్టీఆర్ కూడా ఒకడు అన్నంతగా.. ఇక ఈ చొరవతోనే రాజమౌళి భార్య రమా రాజమౌళి తనను బండ.. అని పిలుస్తారని చెప్పుకొచ్చాడు. షూటింగ్ లో అలిసిపోయి ఉన్నా కూడా రాజమౌళి వదిలేవారు కాదని.. ఆ విషయం రమా గారికి చెప్తే ఆ పిచ్చి ఆయనతో అలాగే ఉంటుంది… త్వరగా వెళ్లి షూటింగ్ చేసి వచ్చేయ్ రా బండ అంటూ తనను పంపేవారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.