Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎంతోమంది హీరోల పక్కన జాన్వీ పేరు నానుతూ వచ్చింది. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా అందరి పేర్ల తరువాత ఎట్టకేలకు ఎన్టీఆర్ తో చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Namratha: సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలిసినవి రెండే రెండు. ఒకటి సినిమా.. రెండు కుటుంబం. షూటింగ్స్, వెకేషన్స్.. ఇవి తప్ప మహేష్ కు బయట వ్యాపకాలు ఏమి లేవు. ఏడాదిలో ఖచ్చితంగా నాలుగుసార్లు అయినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్లకపోతే ఆయనకు ఏడాది గడిచినట్టే అనిపించదు.
Ajith: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లు సృష్టించడం సాధారణమే. అందులో నిజం ఉన్నా.. లేకున్నా.. బయటివారికి మాత్రం నిజమే అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా అది ఇంకొంచెం ఎక్కువ అయ్యింది.
Akhil Akkineni: అక్కినేని నట వారసుడుగా అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. మొదటి సినిమా నుంచి నాలుగు సినిమా వరకు మనోడు ఆశించిన ఫలితాన్ని మాత్రం అనుకోలేకపోయాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.
Manchu Mohan Babu: కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నేడు తన 71 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కు అమెరికా వెళ్లి రాగానే మొదటిసారి విశ్వక్ సేన్ కోసం దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాలిపోయాడు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదట ఆస్కార్ అవార్డును అభిమానుల ప్రేమకు అంకితం చేశాడు.
Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చి 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటించింది.
Simbu: కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరు చెప్పగానే.. ఆయన సినిమాలే కాదు.. ఆయన హీరోయిన్లతో నడిపిన ఎఫైర్లు కూడా గుర్తొస్తాయి. శింబు.. అభిమానుల కోసం, సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒకానొక సమయంలో బరువు పెరిగిన శింబు.. బరువు తగ్గడానికి ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
NTR30: కొన్ని రూమర్స్.. నిజమవుతాయో లేదో తెలియదు కానీ, వినడానికి మాత్రం భలే ఉంటాయి. అందులో కొన్ని ఎన్టీఆర్ 30 లో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అని, ఎన్టీఆర్ 30 పూజా వేడుకకు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నాడు అని, సైఫ్, జాన్వీతో కలిసి పూజా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడని.. బావున్నాయి కదా.
Vijay Antony: బిచ్చగాడు చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ఆ తరువాత కొన్ని సినిమాలతో ప్రేక్షకులను పలకరించినా వాటిలో గుర్తుపెట్టుకొనేవి తక్కువే అని చెప్పాలి. ఇక ఈసారి తనను ఆదరించిన సినిమాతోనే విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.