Akira Nandan: పవన్ వారసుడు ఎంట్రీ ఇలానా.. ఇదెక్కడి ట్విస్ట్ రేణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో రెండు పడవలపై నడుస్తున్నాడు. ఇక ముందు ముందు అయితే సినిమాల్లోకి వస్తాడో రాడో అనే విషయం కూడా తెలియదు. అయితే మరి ఎలా.. పవర్ స్టార్ ఫాన్స్ పరిస్థితి ఏంటి అంటే .. జూనియర్ పవర్ స్టార్ ఉన్నాడుగా.. పవన్ వారసుడు అకీరా నందన్.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే తండ్రిని కొడుకులో చూసుకొని మురిసిపోవచ్చు అని పవన్ ఫ్యాన్స్ ఏవేవో కలలు కంటున్నారు. అయితే అవన్నీ కల్లలుగా మారనున్నాయా..? అంటే నిజమే అనిపిస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అకీరాకు ప్రస్తుతం 19 ఏళ్లు. రేపో మాపో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అనుకొనేలోపు .. ఒక షాకింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చి పవన్ ఫ్యాన్స్ ను షేక్ చేశారు. అకీరా ఎంట్రీ షురూ అయ్యింది. అయితే అది హీరోగా కాదు .. మ్యూజిక్ డైరెక్టర్ గా. చిన్నతనం నుంచి అకీరాకు మ్యూజిక్ అంటే ఆసక్తి. పియానో వాయించడం అంటే అకీరాకు పిచ్చి. ఈ విషయం ఎన్నోసార్లు రేణు చెప్పుకొచ్చింది.
Malavika Avinash: ఆసుపత్రి పాలైన ‘కెజిఎఫ్’ నటి.. దాన్ని ఈజీగా తీసుకోకండి అంటూ పోస్ట్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక ఈ నేపథ్యంలోనే అకీరా ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. ఇక అకీరా సంగీత దర్శకుడిగా మారిన విషయాన్ని యంగ్ హీరో అడవి శేష్ చెప్పుకొచ్చాడు. కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ పేరు .. రైటర్ బ్లాక్. ఒక రచయిత తాను ఒక కథను రాసే సమయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నాడు అనే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కు అకీరా సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇక ఇదే విషయాన్ని అడివి శేష్.. తన ట్విట్టర్ లో తెలిపాడు. “కొత్త కాన్సెప్ట్ తో సూపర్ ట్యాలెంటెడ్ కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించిన రైటర్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ ను షేర్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కు నా ఫేవరేట్ కిడ్ అకీరా మ్యూజిక్ అందించాడు. చాలా అద్భుతంగా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురి అవుతున్నారు. హీరోగా మారతాడు అనుకుంటే అకీరా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. మరి ముందు ముందు మ్యూజిక్ డైరెక్టర్ గానే కొనసాగుతాడా ..? హీరోగా మారతాడా..? అనేది తెలియాల్సి ఉంది.
Proud to share this new concept short film #WritersBlock
Dir by my super dear talented KarthikeyaMusic from my favorite kid Akira Nandan
💫ing the talented Manoj Rishi.
Very very cool
Writer's Block | Short Film | A2 Level Media Studies | Karthikeya Yarlag…… pic.twitter.com/qHdGSSuEvr
— Adivi Sesh (@AdiviSesh) April 12, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!