Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజోల్ ఎన్ని సినిమాలు చేసినా.. షారుఖ్ సరసన ఆమె నటించిన DDL ను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు.ఇక కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ భామ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చాలా గ్యాప్ తరువాత కాజోల్ ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ ల ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. కాజోల్ నటించిన త్రిభంగా సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక కాజోల్ కు ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతేమంది ట్రోలర్స్ కూడా ఉన్నారు. ఆమె ఎక్కడ కనిపించినా ట్రోల్ చేస్తూనేఉంటారు. ఇక కొన్ని రోజులుగా కాజోల్ ముఖం తెల్లగా మారడానికి సర్జరీ చేయించుకుందని పుకార్లు షికార్లు చేశాయి. సాధారణంగానే ఛామన ఛాయతో కనిపించే కాజోల్.. ఈ మధ్య ధగధగ మెరిసిపోయే వజ్రంలా తెల్లగా మెరిసిపోతోంది. అందుకే ఆమె సర్జరీ చేయించుకుందని వార్తలు వినిపించాయి.
సమంత కన్నా ముందు శకుంతలగా నటించిన హీరోయిన్స్ వీరే..
ఇక తాజాగా ఈ పుకార్లపై కాజోల్ స్పందించింది. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ వార్తలపై మాట్లాడుతూ.. ” నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నల్లగా ఉంది.. బండగా ఉంది.. ఎప్పుడు కళ్లద్దాలు పెట్టుకొని ఉంటుంది.. ఈమె హీరోయిన్ ఏంటి అని హేళన చేసేవారు. కానీ, నేను వాటిని ఏరోజు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్లకన్నా నేనే బెటర్, స్మార్ట్ అనుకున్నాను. అలంటి విమర్శలు పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇక నేనేదో తెల్లగా మారడానికి సర్జరీ చేయించుకున్నానని వార్తలు వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజం లేదు. పదేళ్ల క్రితం షూటింగ్స్ అన్ని అవనీ, ఇవనీ బయట తిరిగేదాన్నీ .. దానివలన న స్కిన్ నల్లగా ఉండేది. ఇప్పుడు పదేళ్ల నుంచి నేను ఇంలోనే ఉంటున్నాను. సూర్యరశ్మికి దూరంగా ఉండడంతో స్కిన్ కలర్ వచ్చింది. అంతేతప్ప సర్జరీలు ఏమి చేయించుకోలేదు” అని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.