Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా ఏప్రిల్ 28 న ఏజెంట్ రిలీజ్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఒకపక్క అఖిల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచుతుంటే.. ఇంకోపక్క సినిమాలోని ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని మరో ఇంటరెస్టింగ్ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఒక లవ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా .. ఇక ఇప్పుడు ఒక ఎనర్జిటిక్ సాంగ్ ను, బ్రేకప్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Simran: దేవుడా.. సిమ్రాన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ?
రామకృష్ణ గోవిందా అనే సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. అఖిల్ సిగ్నేచర్ స్టెప్స్ అయితే అద్భుతమని చెప్పాలి. రామకృష్ణ గోవిందా.. గోవిందా.. హరి గోవిందా.. పిల్ల పోతే పోయిందా .. గోవిందా .. హరి గోవిందా అంటూ సాగే ఈ గీతానికి హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫుల్ సాంగ్ ను ఏప్రిల్13న సాయంత్రం 5:05 గంటలకి రిలీజ్ చేయనున్నారు. మొదటి నుంచి ఏజెంట్ లో ఫుల్ వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక లవ్ సాంగ్ తో, ఈ బ్రేకప్ సాంగ్ తో ఏజెంట్ లో ఈ యాంగిల్ కూడా ఉందని ట్విస్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా అఖిల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.