Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్దు.. ఆ తరువాత నెమ్మదిగా హీరోగా మారాడు. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల.. ఇలా చేస్తూ డీజే టిల్లు సినిమాతో స్టార్ హీరోగా మారాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు సిద్దు ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్ని సినిమాలకు సంబంధించినవే .. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతాన్ని బయటపెట్టాడు సిద్దు. టిల్లు స్క్వేర్ ప్రకటించినప్పటినుంచి ఈ సినిమాపై వివాదాలు వస్తూనే ఉన్నాయి. డైరెక్టర్ ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని, హీరోయిన్లతో గొడవపడి.. సిద్దు బయటికి పంపించేశాడని రకరకాలుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై ఈ ఇంటర్వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
Allu Arha: యంగ్ టైగర్ @ 8… అల్లు అర్జున్ కూతురు @ 6…!
మీ సినిమాల్లో హీరోలు చాలా వీక్ గా ఉంటారు.. హీరోయిన్లు స్ట్రాంగ్ గా ఉంటారు.. ఇది కావాలని చేసిందా.. అలా వచ్చిందా..? అన్న ప్రశ్నకు.. ” మగారు కంటే ఆడవారు చాలా స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను. ఫిజికల్ గా మేము స్ట్రాంగ్ అయినా.. ఎమోషనల్ గా మాకంటే ఆడవారు చాలా స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చాడు. ఇక టిల్లు స్క్వేర్ ఇంకా డబుల్ ఉంటుందని, టిల్లుకు అమ్మాయిలతో ప్రాబ్లెమ్ వస్తుంది.. దాన్ని సాల్వ్ చేస్తాడు.. వారిని వదులుకోలేడు.. ఆలా అని ఉండలేడు అని చెప్పుకొచ్చాడు. ఇక టిల్లు స్క్వేర్ లో సిద్దు.. శ్రీలీలను తీసేశాడు.. నేహను తీసేశాడు.. అనుపమతో గొడవ అయ్యింది.. సెట్ లో నుంచి వెళ్ళిపోయింది ఏదేదో రాసుకొచ్చారు. కానీ, మేము మొదట సినిమా అనుకున్నాకా.. ఫస్ట్ కలిసిన హీరోయిన్ అనుపమనే అని చెప్పుకొచ్చాడు. ఇక టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ గురించి మాట్లాడుతూ.. ” నేను మల్లిక్ రామ్ తో రిలేషన్ లో ఉన్నాను. వాడు మా ఇంట్లోనే ఉంటాడు.. మా ఇంట్లోనే తింటాడు.. వాడు పడుకుంటే నేను దుప్పటి కప్పుతాను.. ఇదంతా చూడడానికి రిలేషన్ లానే అనిపిస్తుంది” అని చెప్పాడు. సిద్దు ఏ సినిమా చేసినా ఆ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నట్లే ప్యాంపర్ చేస్తాడు. ఇలాగే డైరెక్టర్ రవికాంత్ ను సిద్దు ముద్దు కూడా పెట్టుకున్నాడు. అప్పట్లో అది సంచలనం క్రియేట్ చేసింది. ఇక విమల్ కృష్ణను ఎందుకు తీసేశారు అన్న ప్రశ్నకు అతడికే కాల్ చేసి మాట్లాడిస్తాను అని చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.