Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ సినిమా.
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. మంచు కుటుంబంలో ఎంతో దైర్యంగా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా మాట్లాడేది మంచు మనోజ్ మాత్రమే అని ఆయన అభిమానులు చెప్పుకొస్తారు. ఇక గత కొంత కాలంగా మనోజ్ జీవితంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
Pushpa 2 : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Bichhagadu 2: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్.
NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
MenToo Trailer: నరేష్ అగస్త్య, రియా సుమన్ జంటగా శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెన్ టూ. లాంటెర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మౌర్య సిద్దవరం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిర్మాతగా మారి మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే కోరికతో ఉన్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు.. బండ్ల గణేష్ అంటే ఎంతో ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Ayushmann Khurrana: బాలీవుడ్ స్టార్ హీరో, సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా తండ్రి ఆచార్య పి ఖురానా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పంజాబ్ లోని మొహాలీలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. హీరోల పుట్టినరోజులు కానీ, స్పెషల్ అకేషన్స్ కు హీరోల హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా రీరిలీజ్ మహా అయితే రెండు సార్లు చేస్తారు.. మూడు సార్లు చేస్తారు.
Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం ఆయనను చూసి గర్వపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. చెన్నెలో పుట్టి పెరిగిన సుందర్ జీవితం ఎంతోమందికి ఆదర్శం.