Varun Tej: వరుణ్ బాబు.. టాలీవుడ్ జాన్ విక్ లా ఉన్నాడురా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది వచ్చిన ఎఫ్ 3 హిట్ ను వరుణ్ ఖాతాలో వేయడం కష్టం కాబట్టి ఈ మెగా హీరోకు ఇప్పుడు ఒక పెద్ద సాలిడ్ హిట్ కావాలి. దానికోసమే మనోడు బాగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుణ్.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ నే నమ్ముకున్నాడు. గతేడాది అక్కినేని నాగార్జున కు ఘోస్ట్ లాంటి భారీ పరాజయాన్ని ఇచ్చిన ప్రవీణ్ సత్తారు.. ఈసారి వరుణ్ కు ఎలాగైనా హిట్ అందివ్వాలని చూస్తున్నాడు. వీరి కాంబోలో వస్తున్న చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఏ.. నాని హీరోయిన్ ఏంటీ .. ఇలా మారిపోయింది
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 25 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఇక దీంతో పాటు వరుణ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఒక గోడపై వరుణ్ చేతిలో గన్ పట్టుకొని కూర్చున్నాడు. అతని ఎదురుగా బాంబ్ లు.. వెనుక బాంబ్ లు పేలుతున్నట్లు కనిపిస్తుంది. బ్లాక్ సూట్ లో వరుణ్ టాలీవుడ్ జాన్ విక్ లా కనిపిస్తున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇందులో వరుణ్ స్పై గా కనిపిస్తున్నాడు. స్పై ఫిల్మ్స్ తీయడంలో ప్రవీణ్ సత్తారు దిట్ట. దీంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో వరుణ్ బాబు హిట్ అందుకుంటాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!