Geethanjali Iyer: దూరదర్శన్.. మనకు తెల్సిన మొట్టమొదటి న్యూస్ ఛానెల్. వార్తలను వార్తలుగా మాత్రమే వినగలిగే ఛానెల్ అది మాత్రమే. ఇప్పుడు ఎన్ని బులిటెన్స్ వచ్చినా అందులో వచ్చే వార్తల కన్నా ఎక్కువ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక అందులో ఇంగ్లిష్ న్యూస్ రీడర్ గీతాంజలి అయ్యర్. ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ఆమె గొంటునే వినేవారు. 30 ఏళ్ళు దూరదర్శన్ న్యూస్ రీడర్ గా పనిచేసిన గీతాంజలి అయ్యర్.. నేడు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇక 1971 లో గీతాంజలి.. దూరదర్శన్ లో జాయిన్ అయ్యారు.
Kriti Sanon: ఓం రౌత్ ముద్దుపై చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీరియస్
30 ఏళ్ళు అలుపు లేకుండా వార్తలను ప్రజలకు అందించారు. నాలుగుసార్లు ఆమె ఉత్తమ యాంకర్ గా అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా 1989 లో అవుట్ స్టాండింగ్ విమెన్ గా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును అందుకొని సంచలనం సృష్టించారు. ఇక గీతాంజలి న్యూస్ ప్రజెంటర్ గా జాయిన్ అయ్యి ఎన్నో పదవులను అందుకున్నారు. అనంతరం ఆమె కార్పొరేట్ రణగంలోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా సీరియల్స్ లో కూడా నటించారు. పఇకపోతే గీతాంజలి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.