Megha Akash: లై సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అయితే అనుకోలేకపోయింది కానీ, అమ్మడికి మాత్రం బాగానే అవకాశాలను అందించింది. ఛల్ మోహన్ రంగ, పేట, రాజా రాజా చోర లాంటి తెలుగు సినిమాల్లో కనిపించింది. ఇక ఈ మధ్యనే రావణాసుర చిత్రంలో నటించి మెప్పించింది. అయినా అమ్మడికి మాత్రం విజయం తలుపుతట్టింది లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే.. ఇంకోపక్క తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గతేడాది ఒక సినిమాను ఒకే చేసి.. సెట్స్ మీదకు తీసుకెళ్లింది. ఇక తాజాగా ఈ చిన్నది పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. మేఘా ఆకాష్.. ఒక వ్యాపారవేత్తను పెళ్లాడనుంది అంట. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి స్నేహితుడని టాక్ నడుస్తోంది.
Geethanjali Iyer: మొట్టమొదటి న్యూస్ రీడర్.. ‘దూరదర్శన్’ గీతాంజలి మృతి
ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పుకున్నాయని, త్వరలోనే ముహుర్తాలు పెట్టుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత.. ఇది అరేంజ్డ్ మ్యారెజ్ నా, లవ్ మ్యారేజ్ నా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. మరి ఈ వార్తలపై మేఘా ఆకాష్ స్పందిస్తుందేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం మేఘా.. తమిళ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారింది. మరి ఈ చిన్నది పెళ్లి అయ్యేలోపు ఒక్క భారీ హిట్ ను అయినా తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.