Fact Check: ప్రభాస్, కృతి సనన్ జంటగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ లో ప్రతి సీటు పక్కన ఒక సీటు హనుమంతునికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ రామాయణం ప్రదర్శించినా అక్కడ హనుమంతుడు వస్తాడని భక్తుల నమ్మకానికి ఇది నిదర్శనమని.. మన పక్కనే హనుమంతుడు కూర్చొని ఆదిపురుష్ చూస్తున్నట్లు నమ్మాలని వారు కోరారు. ఇక ఇదే విషయాన్నీ గతరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆదిపురుష్ అంతా పాజిటివ్ టాక్ తో వెళ్తుంది. అయితే ఆ పాజిటివ్ టాక్ ను చెడగొట్టడానికి ట్రోలర్స్ సిద్ధమయ్యారు. నెగటివ్ టాక్ ను తెప్పించడానికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
NBK108: ఇక నుంచి బాలయ్య.. ‘గ్లోబల్ లయన్’
తాజాగా సోషల్ మీడియా లో ఒక ప్రకటన సర్క్యూలేట్ అవుతుంది. అందులో ‘ఆదిపురుష్’ థియేటర్ లో దళితులకు ప్రవేశం లేదు అంటూ రాసి ఉంది. దీంతో ఇది చూసిన ప్రేక్షకులు సినిమాపై నెగెటివ్ భావనను పెంచుకుంటున్నారు. అయితే ఈ తప్పును వెంటనే గ్రహించిన మేకర్స్ ఈ ప్రకటన ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. అసలు అందులో ఏముంది అంటే.. “రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా “పురుషి” సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో ధర్మం కోసం నిర్మించిన ఆదిపురుష్ ను హిందువులందరూ తప్పక వీక్షిద్దాం” అని రాసి ఉంది. ఇక ఇది ఫేక్ న్యూస్ అని, దయచేసి వీటిని నమ్మొద్దని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది.