ఏ.. నాని హీరోయిన్ ఏంటీ .. ఇలా మారిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ లోకంలో ప్రతిదానికి ఒకచోట ఫుల్ స్టాప్, కామా ఉంటుంది. మనిషి జీవితానికి కానీ, కెరీర్ కు కానీ. చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లకు మాత్రం ఆ ఫుల్ స్టాప్, కామా రెండు వివాహమే. కొంతమంది పెళ్లి చేసుకొని కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతారు. ఇంకొంతమంది కొంత గ్యాప్ అదే కెరీర్ కు కామా పెట్టి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు ఈ కేటగిరిలో ఉన్నవారే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగినవారు పెళ్లి తరువాత కనుమరుగైపోయారు. ఇక రీ ఎంట్రీలో వారిని చూస్తే.. ఏంటి అప్పుడు చూసిన హీరోయిన్ ఈమెనేనా అని అనిపించకమానదు. అల పెళ్లితో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన హీరోయిన్లలో ఒకరు శరణ్య మోహన్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. నాలో పరుగులు తీసే మనసే అంటూ నాని హృదయాన్నే కాదు తెలుగు కుర్రకారు గుండెలను కూడా చోరీచేసింది.
Ashish Vidyarthi: ఛీఛీ.. ముసలోడు.. రెండో పెళ్లి అంటున్నారు.. చేసుకుంటే తప్పేంటి
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇక ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటించిన కత్తి సినిమాలో ఆయనకు చెల్లిగా నటించి మెప్పించింది. అయినా ఈ చిన్నదానికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో శరణ్య.. తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇక ఆమె పిల్లలు పుట్టిన దగ్గరనుంచి వారి ఆలనాపాలన చూసుకుంటూ ఇంటి బాధ్యతలను చక్కబెడుతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది. తన భర్తతో కలిసి రీల్స్ చేయడం, పిల్లల ఫోటోలను, తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇకపోతే అప్పటికి ఇప్పటికీ శరణ్యలో చాలానే మార్పు వచ్చింది. పెళ్లి అయ్యాక ఆమె కొద్దిగా బరువు పెరిగింది. అయితే అప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నదో.. ఇప్పుడు కూడా అంతే క్యూట్ గా ఉంది. మరి ముందు ముందు శరణ్య రీ ఎంట్రీ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!