Off The Record: పవన్ కల్యాణ్ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?
- పవన్‌కళ్యాణ్ తాజా వ్యాఖ్యల చుట్టూ కొత్త చర్చలు..
- పాలనాపరమైన బిజీలో ఉంటూనే ఉస్తాద్‌భగత్‌సింగ్ షూటింగ్..
- ప్రీ రిలీజ్ వేడుకల్లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ కావని మొదట అనిపించిందన్న పవన్..
- ఈ ప్లానింగ్ చూశాక బ్యాలెన్స్ అవుతుందనిపిస్తోందన్న డిప్యూటీ సీఎం..
- ఇక కొత్త సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా?..
- బ్యాక్ టు బ్యాక్ సివిమాలకు సైన్ చేసేస్తారా?..
- సినిమా నటనే తన ఆదాయ మార్గం అని గతంలో అన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక నుంచి తాను ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తానని, తన ప్రధమ ప్రాధాన్యం కూడా పాలిటిక్సేనని గతంలో ప్రకటించారాయన. దాంతో … చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి సిల్వర్ స్క్రీన్‌కు దూరం అవుతారని అంచనాలు వేసుకున్నారు చాలామంది. ఇక డిప్యూటీ సీఎంగా ఉంటూనే…. పెండింగ్‌లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్‌ను పూర్తిచేశారాయన. ఆ రెండూ విడుదలయ్యాక మరో పెండింగ్ మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్ గురించిన చర్చలు మొదలయ్యాయి. పాలనాపరమైన బిజీలో ఉంటూనే… మధ్య మధ్య గ్యాప్స్‌లో ఆ షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు పవన్. ఈ నెల 19న రిలీజ్‌కు రెడీ అయింది ఉస్తాద్. ఆయన మూవీ కెరీర్‌కు ఇదే ఆఖరని, ఈ సినిమాతో పవర్ స్టార్ ప్యాకప్ చెప్పేస్తారన్న చర్చలు ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి.
ఇంకా చెప్పాలంటే… తన సినీ కెరీర్ విషయంలో ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టే కనిపిస్తోందని అంటున్నారు. రాజకీయాలు, సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోలేమోనని మొదట్లో అనిపించిందని, కానీ…. ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర నిర్మాతలు, దర్శకుల ప్లానింగ్ చూశాక బ్యాలెన్స్ చేసుకోవచ్చని అనిపిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం. పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చని కూడా పవన్ అన్న మాటలతో… ఇక కొత్త సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనన్న క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు పరిశీలకులు. పవన్‌తో మూవీ చేయాలనుకున్న వాళ్లు నిరాశ పడక్కర్లేదని, గేట్స్ ఓపెన్ చేసే ఉన్నాయన్న మాటలు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్స్ అయిన ప్రజాప్రతినిధులు తమ వృత్తి, వ్యవహారాలను కొనసాగిస్తున్నప్పుడు నేను మాత్రం ప్లాన్డ్‌గా ఎందుకు చేసుకోకూడదన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధిగా తన కార్యకలాపాలను డిస్ట్రబ్ చేయకుండా నిర్మాతలు, దర్శకులు ప్లాన్ చేసుకుని వస్తే….
Also Read
ఇక, బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు పవన్ సైన్ చేయవచ్చన్న చర్చలు నడుస్తున్నాయి సినిమా పరిశ్రమలో. రాజకీయాల్లో నిజాయితీగా కొనసాగాలంటే ఆర్థిక వనరులు అవసరమని సినిమాల్లో నటించడం ద్వారానే తాను వాటిని సమకూర్చుకుంటున్నానని గతంలో కూడా ప్రకటించారు పవన్‌కళ్యాణ్. తనకు పెద్దగా ఆస్తులు లేవని, అవినీతి చేయబోనని చెబుతూ… పార్టీ, కుటుంబ పోషణ కోసం మేకప్‌కు దూరం కాబోనని తాజాగా కూడా చెప్పకనే చెప్పేశారాయన. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు, రెండు పడవల ప్రయాణం ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!