Adipurush:ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేశారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించిన ప్రతి వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నట్లు తెలిపిన మేకర్స్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుంది మాత్రం అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాటిన్ సినిమాలతో దేశం మొత్తాన్ని షేక్ చేసిన ఈ బ్యానర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. ఇక తాజాగా అభిషేక్ అగర్వాల్.. ఆదిపురుష్ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ సినిమాను అనాధ పిల్లలకు, వృద్దులకు ఉచితంగా చూపించనున్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను రిలీజ్ చేశారు.
Intinti Ramayanam Trailer: పెళ్ళాం ఊరెళ్లిందని మందేస్తే.. మొత్తం ఊడ్చేశారుగా
“పురుషోత్తముని స్మరించుకుందాం. ఆదిపురుష్ వేడుకలు జరుపుకుందాం. శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి మరియు అతని దివ్య అడుగుజాడలను అనుసరించాలి. మునుపెన్నడూ లేని అనుభూతిలో మునిగిపోదాం. శ్రీ. అభిషేక్ అగర్వాల్ గారు తెలంగాణ వ్యాప్తంగాఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పదివేలు కు పైగా టికెట్స్ ను ఉచితంగా ఇవ్వనున్నారు. మీరు చేయాల్సిందల్లా Google ఫారమ్ను పూరించండి మరియు నమోదు చేసుకోండి. మేము మీకు టిక్కెట్లు పంపుతాము” అంటూ తెలిపారు. ఇది ఎంతో మంచి విషయం. సినిమాను చూడలేని వారికోసం అభిషేక్ అగర్వాల్ చేస్తున్న ఈ పని ఎంతో ఆదర్శమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.