7వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. 7వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 15న చక్రస్నానం, ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
ఇక, 7వ తేదీన రాత్రి పెద్దశేష వాహనంపై విహరించనున్న శ్రీవారు.. 8వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం… రాత్రి హంస వాహనంపై.. 9వ తేదీ ఉదయం సింహ వాహనం… రాత్రి ముత్యపు పందిరి వాహనంలో.. 10వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం… రాత్రి సర్వభూపాల వాహనంపై వివరిస్తారు.. 11వ తేదీ ఉదయం మోహిని అవతారంలో దర్శనమివ్వనున్న శ్రీవారిని రాత్రి గరుడ వాహనంపై ఊరేగిస్తారు.. 12వ తేదీ ఉదయం హనుమంత వాహనం… సాయంత్రం స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనం… రాత్రి గజ వాహనంపై విహరిస్తారు.. 13వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం… రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు.. 14వ తేదీ ఉదయం రథం బదులుగా సర్వభూపాల వాహనం… రాత్రి అశ్వవాహనంపై ఊరేగుతారు.. ఇక, 15వ తేదీ ఉదయం చక్రస్నానం నిర్వహించనుండగా.. రాత్రి ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!