ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేవలం లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ సంబంధించి ప్రస్తుతం ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘వాలంటీర్’ అంటూ ఓ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా విశేషాలు చూస్తే..
Also read: Prabhas: ప్రభాస్ ఫుల్ బిజీ.. రెండేళ్లు ఆగాల్సిందే!
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథను అందించిన చిన్ని కృష్ణ నిర్మాతగా మారి కొన్ని సినిమాలు తీస్తున్న సంగతి మనకు తెలిసిందే. సూర్య కిరణ్, దియా రాజ్ జంటగా చిన్ని కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై మరో కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమాకు ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తుండగా.. చిన్ని కృష్ణ సారథ్యంలో రాకేష్ రెడ్డి నిర్మాణంలో వాలంటీర్ అనే సినిమాను తీయబోతున్నారు.
Also read: Prabhas: ప్రభాస్ ఫుల్ బిజీ.. రెండేళ్లు ఆగాల్సిందే!
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సామాజిక ఇతివృత్తాంతంతో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా తిరుపతి నగరంలో టైటిల్ లాంచ్, అలాగే ఫస్ట్ లుక్ రిలీజింగ్ కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. మా సినిమాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ ముఖ్య పాత్ర పోషించారని., సమాజంలో వాలంటరీ పాత్ర గురించి తెలియజేసే సినిమా ఇది అంటూ చెబుతూనే.. ఆల్రెడీ సినిమా షూటింగ్ అయిపోయిందని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపాడు. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో కాస్త ఆసక్తి నెలకొంది.