తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు.
CM Revanth Reddy: నేడు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు.
తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు.
ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. దీంతో ఏర్పాటైన సిట్ గత రెండు రోజులుగా విచారణ చేసి.. పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్ట్ ను రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు.
తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిది గంటలుగా అల్లర్ల ఘటనప్తె నమోద్తెయిన కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను సంబంధించి ఎస్ హెచ్ ఓ లను అడిగి తెలుసుకుంటున్నారు.
తిరుపతిలో సిట్ బృందం చేపట్టిన విచారణ కొనసాగుతోంది. మరో రెండు, మూడు గంటలు పాటు విచారణ సాగే అవకాశం ఉంది. దాడి ఘటనపై పలు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను, దాడి సమయంలోని తీసినా వీడియోలు సిట్ పరిశీలిస్తోంది.
ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా జోరుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీజాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి విచ్చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించారు.