తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్... వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. తిరుపతి టూ రాజమండ్రి.. రాజమండ్రి టూ తిరుపతికి అలయన్స్ ఎయిర్ సర్వీసు ప్రారంభించనున్నది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. వారంలో మంగళ, గురు,శని వారాల్లో సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల 40 ని.లకు రాజమండ్రి నుండి బయలుదేరి11 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు. ఉదయం 7గంటల 40 నిమిషాలకు తిరుపతిలో…
Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పోటీ చేసి గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు తిరుపతి. ఆరణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసింది ఒకే సీటు అయినా…ఎన్నికల టైంలో… ఆ గెలుపు సౌండ్ మాత్రం రాయలసీమ మొత్తంలో ప్రతిధ్వనించింది. చివరి నిమిషంలో సీటు దక్కినా… 60వేలకు పైగా భారీ మెజారిటీతో ఆరణి విజయం సొంతం చేసుకోవడం గురించి అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ…
తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... ఆ పార్టీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. కానీ... గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పటినుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు.
Om Birla: మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ‘‘మహిళా సాధికారత సదస్సు’’లో ఆయన మాట్లాడారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశము కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వారు ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు. Read Also: Motel Killing: డల్లాస్ ‘‘నాగమల్లయ్య’’ హత్యతో ప్రవాసుల్లో భయం..…
Off The Record: ఐఏఎస్ అధికారి గిరిషా పేరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి మోగిపోతోంది. ముఖ్యంగా టీడీపీ సర్కిల్స్లో ఆయన గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. దొంగ ఓటర్ కార్డుల కేసులో ఆయనకు క్లీన్చిట్ రావడమే అందుకు కారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లోక్సభ నియోజక వర్గ ఉప ఎన్నికలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన పీఎస్ గిరిషాకు తాజాగా ఉపశమనం లభించింది. ఇందులో ఆయన పాత్ర ఏం లేదని ప్రభుత్వానికి నివేదిక…
తిరుపతి జిల్లా గూడూరులో బుధవారం జరిగిన హత్య కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. ఈ కేసులో మరో లేడీ డాన్ వందన పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో హంతక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడిపై మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐఏఎస్ అధికారి లక్ష్మీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. టీడీఆర్ బాండ్లు విషయంలో ఏ విచారణకైనా నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు.. నాపై వచ్చే విమర్శలకు నేను ఎప్పుడూ స్పందించను.. కానీ, రెండు సంవత్సరాలు నా మనసులో ఉన్న అభిప్రాయం ఇది అన్నారు.